లింగంపల్లి కృష్ణ మందిర్ పీఠాధిపతి మాచాలే బాబా ఆల్ ఇండియన్ అనుభవల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
శాలువాతో సన్మానించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
సదాశినగర్ మండల్ తెలంగాణ కెరటం (ప్రతినిధి) 26 నవంబర్
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగంపల్లి కృష్ణ మందిర్ పీఠాధిపతి మచాలే బాబా ఆల్ ఇండియా మహానుభావల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లి బాబను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మచాలే బాబా చేసిన సేవలను ఆధ్యాత్మిక విషయాలను ధర్మం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎంతో కృషి చేశారని అన్నారు.దేశంలోని హిందూ ధర్మాన్ని ఆనాడు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతను ప్రజల్లోకి తీసుకెళ్లి సన్మార్గంలో వెళ్లే విధంగా కృషి చేయడం గొప్ప విషయం అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు ఉమ్మడి సదాశివనగర్ మండలం మాజీ జెడ్పిటిసి లు పడిగెల రాజేశ్వరరావు కమ్లి నరసింహులు మాజీ ఎంపీపీ రమేష్ చందాపూర్ దేమేకలాన్ సర్పంచులు మంగారెడ్డి రాజిరెడ్డి మాజీ కౌన్సిలర్ కృష్ణాజి రావు స్థానిక మండలం బారాస ప్రధాన కార్యదర్శి నాగోల్ తాడువాయి మండలం కన్వీనర్ నరసింహులు లింగంపల్లి గ్రామ అధ్యక్షుడు సుధాకర్ రావు సారంగు బాబా మోహన్ బాబా తదితరులు పాల్గొన్నారు



