Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పెద్దేముల్ గురుకులంలో రాజ్యాంగ దివాస్

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:13 PM | 10 | Politics, తెలంగాణ
పెద్దేముల్ గురుకులంలో రాజ్యాంగ దివాస్
పెద్దేముల్ గురుకులంలో రాజ్యాంగ దివాస్

- ఘనంగా నిర్వహించిన గురుకులం
- విద్యార్థుల ఉపన్యాసాలు
- పీఠిక చదివిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

 తెలంగాణ కెరటం తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పెద్దేముల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 'రాజ్యాంగ దివాస్ 'వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్, నిర్వాహన కర్త మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుక ఉదయం అసెంబ్లీ సమయంలో నిర్వహించారు. రాజ్యాంగం రచించడానికి ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారు. విద్యార్థులు రాజ్యాంగం లోని 12 షెడ్యూల్ ను అందరికీ వివరించారు. ఏ షెడ్యూల్లో ఏ అధికరణలూ ఉంటాయో కూడా తెలిపారు. రాజ్యాంగం పైన విద్యార్థులు కూడా ప్రసంగించి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విశిష్టతను తెలియజేశారు.రాజ్యాంగ పీఠికను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చదివారు.ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్ మాట్లాడుతూ... రాజ్యాంగం రచించడానికి అనేకమంది తమ జీవితాలను త్యాగం చేశారు. ఆరోజు నలభై కోట్ల మంది కోసం రాసిన రాజ్యాంగం ఈరోజుకు చెక్కుచెదరకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉపయోగపడుతుంది. అంటే దానికి కారణం ఆ రోజు వారి యొక్క రాజనీతిజ్ఞత అని కొనియాడారు. రాజ్యాంగం ఏ ఒక్కరి కోసం కాదు. మనందరి కోసం అని వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. రాజ్యాంగాన్ని మనం రక్షిస్తే,అది మనని రక్షిస్తుందని అని తెలిపారు. విద్యార్థులు  రాజ్యాంగం ప్రకారం బాధ్యతలను నిర్వహిస్తూ,హక్కులను ఆడగాలని తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా కొనసాగాలంటే రాజ్యాంగం ఎంతో అవసరం అని వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్ తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాణకర్త మహేష్ మాట్లాడుతూ... రాజ్యాంగం అనేది పుస్తకం కాదు. అది మన హక్కులను కాపాడుతుంది, గౌరవాన్ని పెంపొందిస్తుంది, భవిష్యత్తుకు పునాది అని కొని ఆడారు. రాజ్యంగాన్ని 286 మంది రాశారు.అది ఈరోజుకు చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 అధికరణలు ఉన్నాయి. మన అవసరానికి వాటిని విస్తరిస్తూ పోతున్నాం. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. కాబట్టి ప్రతి సంవత్సరం నవంబర్ 26ను రాజ్యాంగ దివాస్ గా జరుపుకుంటాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్,  జ్యోతి(జెఎల్), మహేష్, శివ కుమార్, సర్పరాజ్, ముంతాజ్, హరీష్ రెడ్డి, పిఈటి నరేష్, మహిజాబిన్, నాగరాజు,విజయలక్ష్మి సునీత, రజిత,దిల్షాన్, మొగులయ్య, బబ్లు, ప్రకాష్,ప్రవీణ్, పూర్ణిమ,లైబ్రేరియన్ కృష్ణవేణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: