Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:16 PM | 4 | Politics, తెలంగాణ
మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు.

ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు.

మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దర్శించుకున్న సీఎం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26):

నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగు పుణ్యక్షేత్రంలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏ. రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, నాగర్ కర్నూల్ యంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు, అర్చకులు ముఖ్యమంత్రికి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి గర్భాలయంలో కొలువుదీరిన మూలవిరాట్ శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకుని స్వామివారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.మద్దిమడుగు పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య సాగిన ఈ సందర్శన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం 16 ఎకరాల ప్రభుత్వ భూమిలో 159 కోట్లతో లంబాడ ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవాలాల్ ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు కు భూమి పూజ చేశారు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల ప్రాంతంలో సంతు సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బలహీనవర్గాలుగా ఉన్న లంబాడాలను ఎస్టీ జాబితాలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చడం జరిగిందని,బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీలకు,  ఇందిరాగాంధీ హయాంలో రెండు ఎకరాల భూమిని పంచడం జరిగిందని, నేడు ఇద్దరమ్మాయిలతో పేదలకు ఇల్లు నిర్మిస్తున్నామని, మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం, కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తెల్ల రేషన్ కార్డు వారికి సన్న బియ్యం,అందిస్తున్నామని అన్నారు. లంబాడాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాంచందర్ నాయక్ బలరాం నాయక్ నాగర్ కర్నూల్ ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్సీలు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: