Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజురాబాద్ అభివృద్ధి చేసింది నేనే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించా!

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:43 PM | 21 | Politics, తెలంగాణ
హుజురాబాద్ అభివృద్ధి చేసింది నేనే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించా!
హుజురాబాద్ అభివృద్ధి చేసింది నేనే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించా!

హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 26

తెలంగాణ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నా.. హుజురాబాద్ ప్రజలు నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.స్థానిక నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతల్లో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు.రోడ్లు, చెక్‌డ్యాంలు, సబ్‌స్టేషన్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణంలో నా పాత్ర ఏంటో ప్రజలకు తెలుసు
తీరిక దొరికినప్పుడల్లా హుజురాబాద్‌కు వస్తా
 ఎంపీ ఈటల రాజేందర్
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన పనులను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని, నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నందున హుజురాబాద్‌కు తరచూ రాలేకపోతున్నానని, తన పరిస్థితిని నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. తీరిక దొరికినప్పుడల్లా తప్పకుండా హుజురాబాద్‌కు వస్తానని స్పష్టం చేశారు.తెలంగాణలో ఎక్కడ సమస్య వచ్చినా స్పందిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నానని ఈటల పేర్కొన్నారు. అసైన్డ్ భూములు, 22ఏ నిషేధిత భూముల సమస్యలపై తాను చేసిన పోరాటం రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమందికి ప్రయోజనం చేకూర్చిందన్నారు. 70 లక్షల జనాభా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజూ ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. జ్వరం వచ్చిందని, విశ్రాంతి కావాలని ఏ ఒక్కరోజూ ప్రజా సమస్యల నుంచి దూరంగా ఉన్న సందర్భం లేదని వెల్లడించారు.
హుజురాబాద్ ప్రజల కోసమే నా పోరాటం
ప్రాణహిత జలాలను తీసుకురావాలని, కాలిపోతున్న మోటార్ల సమస్యను పరిష్కరించాలని, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా హుజురాబాద్ ప్రజల ప్రయోజనాల కోసమేనని ఈటల అన్నారు. ప్రజా సమస్యలను ఎప్పుడూ పక్కనపెట్టలేదని, తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిరోజూ షామీర్‌పేటలోని తన నివాసానికి వచ్చే వారిలో ఎక్కువమంది హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వారేనని తెలిపారు. ఉదయం తన ఇంటికి సుమారు 400 మంది వస్తే అందులో కనీసం వంద మంది హుజురాబాద్ ప్రాంతానికి చెందినవారే ఉంటారని చెప్పారు.అభివృద్ధిపై మాట్లాడే ముందు మీ పనితనం చూపించండి.హుజురాబాద్‌లో ప్రస్తుతం ఉన్న నాయకుల హనీమూన్ కాలం అయిపోయిందని, అభివృద్ధి విషయంలో విమర్శలు చేసే వారు తాము ఏం చేశారో ప్రజలకు చూపించాలని ఈటల సవాల్ విసిరారు. రాజేందర్ ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించే వారు, తాము చేసిన అభివృద్ధి పనుల వివరాలను బయటపెట్టాలని అన్నారు. జమ్మికుంట సమావేశంలో కేసీఆర్‌ను అడిగి రూ.1,200 కోట్లు తీసుకొస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.గతంలో వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రోడ్లు ఎవరు వేయించారు? పంటలు ఎండిపోకుండా చెక్‌డ్యాంలు ఎవరు నిర్మించారు? మోటార్లు కాలిపోకుండా విద్యుత్ సబ్‌స్టేషన్లు ఎవరు ఏర్పాటు చేశారు? విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సబ్‌స్టేషన్లు, చెక్‌డ్యాంలు, రోడ్ల నిర్మాణంలో తన పాత్ర ఏమిటో హుజురాబాద్ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ప్రస్తుత నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ చేతల్లో మాత్రం పనులు కనిపించడం లేదని విమర్శించారు.
ఇప్పటికీ హుజురాబాద్ ప్రజలకే నా దగ్గర ఎక్కువ ప్రాధాన్యంతన వద్దకు వచ్చే హుజురాబాద్ ప్రజలకు ఇప్పటికీ అన్ని విధాలా అండగా ఉంటున్నానని ఈటల తెలిపారు. కాలేజీ ఫీజుల నుంచి ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల వరకు, హైదరాబాద్‌లో ఉద్యోగాల నుంచి చిన్నచిన్న అవసరాల వరకు తన సహాయం కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తన సేవలను అత్యధికంగా వినియోగించుకుంటున్నది హుజురాబాద్ ప్రజలేనని పేర్కొన్నారు.కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన గొప్ప నాయకులు కాలేరని, ధైర్యవంతులు సమస్యలను ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని వ్యాఖ్యానించారు. నాయకుడి పనితనం మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలని అన్నారు.
తాను హుజురాబాద్ ప్రజలను ఎప్పుడూ మరిచిపోలేదని, ప్రస్తుతం రాష్ట్రస్థాయి సమస్యలపై పోరాటం చేస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో హుజురాబాద్ ప్రజలు అందించిన ఆదరణ, అండదండలు మరువలేనివని, సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గానికి వచ్చి ప్రజలను కలుస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: