Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రైవేట్ బస్సు యజమానుల దోపిడి అరికట్టాలని

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 09:40 PM | 4 | Politics, తెలంగాణ
ప్రైవేట్ బస్సు యజమానుల దోపిడి అరికట్టాలని
ప్రైవేట్ బస్సు యజమానుల దోపిడి అరికట్టాలని

 నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి

 తెలంగాణ కెరటం నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 26:


ముంబై జగిత్యాల నిజామాబాద్ జిల్లా మీదుగా నడిచే ప్రైవేట్ బస్సుల అధిక చార్జీలను నియంత్రించాలిముంబై జగిత్యాల వయా నిజామాబాద్ మధ్య నడుస్తున్న ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్న యాత్రికులు ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన సమస్యలను నిజామాబాద్ సిటీలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. అందులో తమ వలసజీవులకు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో కన్ఫర్మ్ టికెట్లు దొర్కనందు వల్ల ప్రైవేట్ బస్సులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు యజమానులు ఇష్టానుసారంగా ఒక్కో ప్రయాణికుడి నుంచి సుమారు రూపాయలు 2,500 నుంచి 3,500 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మార్గ మధ్యలో ఆపరేటర్లు బస్సు లోపల పెద్ద మొత్తంలో పార్సిల్ సరుకు, భారీ లగేజీని లోడ్ చేస్తున్నారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత, అధిక బరువు, ప్రయాణికులకు తగినంత స్థలం లభించక పోవడం అన్యాయమన్నారు. కొన్నిసార్లు సాలురా చెక్ పోస్ట్ వద్ద తనిఖీ సమయంలో లగేజీ, బరువు తనిఖీల కోసం యాత్రికులను బస్సుల నుంచి దిగమని చెబుతున్నారు. ధరలు తగ్గించాలి, ఓవర్ పార్సిల్ లోడింగ్, వాణిజ్య పార్సిల్ తో నిండిన బస్సులను తనిఖీలు చేయాలి. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం  చేయాలని ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్) చైర్మన్ మూలనివాసి మాలజీ, కన్వీనర్ సామ్రాట్ అశోక్, ఉమేష్ మహరాజ్, జర్నలిస్టులైన అంగుళి మాలజీ, మామిడి రాజు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: