Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోడు భూముల పట్టాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 06:06 PM | 25 | Crime, తెలంగాణ
పోడు భూముల పట్టాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.

 గుళ్లు, గోపురాలు కట్టండి..  రైతులకు సాగునీరు ప్రాజెక్టు సంగతేమి! మద్దిమడుగు సభలో సాగునీరు, 

పోడు భూముల పట్టాలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.  చెంచుల జీవనాధారమైన పోడు భూములకు పట్టాలేవి?

 స్థానిక ప్రజల ఆవేదన.

ఇవి కూడా చదవండి

News Image

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతి) (నవంబర్ 27):దేవాలయాలు నిర్మించండి. విగ్రహాలు ప్రతిష్ఠించండి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి. వీటికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ అదే సమయంలో ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, రైతుల పంటలకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగు ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఆశించారు. దేవాలయ నిర్మాణానికి 78  కోట్ల రూపాయల బడ్జెట్ను  ప్రకటించారు.అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించి ఉంటే ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరిగేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.నల్లమల ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనులు, ఇతర పేద ప్రజలు తరతరాలుగా పోడు భూములపై ఆధారపడి వ్యవసాయంచేసుకుంటూజీవనోపాధిపొందుతున్నారని. అయితే ప్రస్తుతం అటవీశాఖ అధికారుల వివిధ ఆంక్షల కారణంగా వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగుకు దూరమవుతూ జీవనోపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించి, పట్టా పాసుపుస్తకాలు అందించి వ్యవసాయానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.ముఖ్యమంత్రి మద్దిమడుగు పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలోనైనా సాగునీటి ప్రాజెక్టులు, పోడు భూముల పట్టాల సమస్యలపై స్పష్టమైన ప్రకటన వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ ఈ కీలక సమస్యలపై ఎలాంటి స్పష్టమైన స్పందన రాకపోవడంతో స్థానిక ప్రజలు నిరాశ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి స్థానిక ప్రజల విజ్ఞప్తి:అమ్రాబాద్ లిఫ్ట్, ఉమామహేశ్వరం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పనులు ముందుకు తీసుకెళ్లాలి. నల్లమల ప్రాంత ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలి. అర్హులైన చెంచు గిరిజనులకు, పోడు సాగుదారులకు చట్టప్రకారం భూములపై హక్కులు కల్పించి పట్టాలు మంజూరు చేయాలని .ప్రజలకు దేవాలయాలు ఎంత ముఖ్యమో. జీవించడానికి నీరు, సాగు చేసుకోవడానికి భూమి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధి కూడా అంతే ముఖ్యమని స్థానికులు పేర్కొంటున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: