Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్తీక మాసంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 06:42 PM | 4 | Bhakti, తెలంగాణ
కార్తీక మాసంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు
కార్తీక మాసంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకం.. ప్రజలందరికీ శివుడి ఆశీస్సులు కలగాలని ఆకాంక్ష

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 27: కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ శివ దుర్గ సమేత రామలింగేశ్వర స్వామివారిని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్‌కేసర్ మండలం మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కీసర డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కోలా బాలరాజు యాదవ్‌తో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో పవిత్రమైన విషయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవడంతో పాటు భక్తి, ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ పరమశివుని కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా కీసర డివిజన్ అధ్యక్షుడు పొట్ట ఆంజనేయులు, కిసాన్ మోర్చా కీసర డివిజన్ అధ్యక్షుడు అన్నోజిగూడ మల్లారెడ్డి, బీజేవైఎం రూరల్ జిల్లా కార్యదర్శి దేశం రమేష్ గౌడ్, నాయకులు కుమ్మరాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: