Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజారోగ్యానికి భరోసా.. వన్యప్రాణుల సంరక్షణకు అండగా మరో ముందడుగు.

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 04:34 PM | 15 | Politics, తెలంగాణ
ప్రజారోగ్యానికి భరోసా.. వన్యప్రాణుల సంరక్షణకు అండగా మరో ముందడుగు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు చెంచు పెంటల్లో నివసించే గిరిజన ప్రజలకు క్షయవ్యాధి (టీబీ ) నివారణ, ముందస్తు గుర్తింపు లక్ష్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఎస్బిఐ చైర్మన్ శ్రీనివాస్ శెట్టి తో మాట్లాడి ఎస్బిఐ ఫౌండేషన్ సహకారంతో సి ఎస్ ఆర్ నిధుల ద్వారా ప్రత్యేక టీబీ పరీక్షల అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారు.భవిష్య భారత్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ అంబులెన్స్ ద్వారా మారుమూల గ్రామాలు, చెంచు పెంటల్లో ప్రజలకు టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని అదేవిధంగా బి ఏ ఐ ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వన్యప్రాణులకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక వెటర్నరీ అంబులెన్స్‌ను కూడా అందించారు.ఈ రెండు అంబులెన్స్‌లను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి , నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తో కలిసి జెండా ఊపి శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు.ఈ కార్యక్రమం పై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

News Image

 మాట్లాడుతూమారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మూగజీవాల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా, ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రజా నాయకత్వానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ సంస్థ అధికారులు, భవిష్య భారత్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు, పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజారోగ్యానికి భరోసా.. వన్యప్రాణుల సంరక్షణకు అండగా మరో ముందడుగు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: