Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బజార్ కొత్తూరులో బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 04:42 PM | 12 | Politics, తెలంగాణ
బజార్ కొత్తూరులో బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

News Image

నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం నందిపేట్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు, నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గారి ఆధ్వర్యంలో నందిపేట్ మండలం బజార్ కొత్తూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన యువకులు, నాయకులకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత పదేళ్ల పాలనలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని మచ్చర్ల సాగర్ పిలుపునిచ్చారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తూ తెలంగాణ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో దేశంలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందంజలో నిలిచిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడేలా చేసిందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలగంగాధర్, మాజీ సర్పంచ్ బాబు రాజ్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, కొత్తూరు భరత్, వార్డు సభ్యులు పాషా, తాటికాయల సాగర్, గణేష్, మొగులాజి దామోదర్, రవి, తేలు భోజన్న, సాయికుమార్, నరసయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, నరేష్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: