Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 04:54 PM | 24 | Politics, తెలంగాణ
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ కెరటం భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా దళిత మేధా శక్తి (DMS) నర్సంపేట మండల అధ్యక్షులు శ్రీ కుక్కమూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా శ్రీ దళిత మేధా శక్తి (DMS) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోట్ల పవన్ - న్యాయవాది గారు పాల్గొని మహాత్మా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థ ను అంతమోందించుట కొరకు, కుల వివక్షను రూపుమాపడానికి, మహిళా విద్యను

News Image

 ప్రోత్సహించడానికి ఫూలే చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. 1873 సం,,రంలో సత్యశోధక్ సమాజ్ స్థాపన ద్వారా అణగారిన వర్గాలలో కుల నిర్ములన, విద్య వ్యాప్తి, మహిళల బాల్య వివాహలు, వితంతు పునర్వీవాహాలు, అంటరానితనం పై చైతన్యం నింపిన మహనీయుడని, నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతి రావు పూలె రచించిన పుస్తకాలలో గులాంగిరి ప్రాముఖ్యమైనదని వారు అన్నారు ఇట్టి గులాంగిరి పుస్తకాన్ని నల్లజాతి ఆమెరకాన్లకు పోరాట స్ఫూర్తికి అంకితమిస్తూ భారతదేశంలో ఉన్న కులవివక్షను పోల్చుతు అదేతరహాలో భారతదేశంలో కూడా పోరాడాలని వారు అన్నారు. మన భారతదేశంలో 1847 సం,, రంలో పూణేలో మన దేశంలో అణగారిన వర్గాలకు చదువుకోవాలని కోరుతూ పాఠశాల స్థాపించడం జరిగింది తన జీవితం మొత్తం కూడా అణగారిన ప్రజల కొరకు అంకితం ఇచ్చారని వారు కొనియాడారు. అణగారిన ప్రజల జీవన ప్రమాణాలు మారాలంటే విద్య ఒక్కటే ఏకైక మార్గమని చెప్పారని వారు అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలె చనిపోయిన తరవాత అట్టి ఉద్యమాన్ని తన భార్య సావిత్రి బాయి పూలె మరియు ఛత్రపతి సాహు మహారాజు గార్లు ముందుకు తీసుకుపోయారని వారు అన్నారు భవిష్యత్ కాలంలో సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు దళిత బహుజనులు అందరు ఏకమై పోరాడాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలోదళిత మేధా శక్తి వ్యవస్థాపక సభ్యులు శ్రీ అడ్డ రాజు గారు, శ్రీ పెంబర్తి శ్రీనివాస్ గారు, నర్సంపేట మండల అధ్యక్షులు శ్రీ కుక్కమూడి శ్రీనివాస్ గారు, దళిత మేధా శక్తి నర్సంపేట డివిజన్ నాయకులు శ్రీ అడ్డ సతీష్ గారు, చింత సురేష్ గారు, బహుజన నాయకులు గుళ్ల శివ గారు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: