Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రోటోకాల్ ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సి ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు...

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:38 PM | 6 | Politics, తెలంగాణ
ప్రోటోకాల్ ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సి ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు...
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
 రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (చీఫ్ సెక్రటరీ) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి , ఎమ్మెల్యేలు కెపి. వివేకానంద్ , డి. సుధీర్ రెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజలచే ఎన్నికైన ఎమ్మెల్యేలకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ సమానంగా గౌరవించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: