Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్ష బిఆర్ఎస్ ,బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:44 PM | 3 | Politics, తెలంగాణ
బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్ష బిఆర్ఎస్ ,బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

గత బి ఆర్ ఎస్ హయాంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్ధ నేతలు.

 ముఖ్యమంత్రి పర్యటన తో భయపడుతున్న నేతలు.

 అచ్చంపేట నియోజకవర్గం లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.

ఇవి కూడా చదవండి

 నల్లమల అచ్చంపేట లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు.

 ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్ష బి ఆర్ ఎస్ బిజెపి నాయకులు చెల్లించుకోలేకపోతున్నారని, గత ప్రభుత్వ హాయంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అసమర్ధ నేతలని ముఖ్యమంత్రి పర్యటనతో భయపడుతున్నారని అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని నల్లమల అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సభకు తరలివచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, అధ్యక్షులు ఖాదర్,తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజగోపాల్ తదితరులు ఉన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: