Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చింత గోపాల్ నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రి హరీశ్ రావు

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:42 PM | 3 | Politics, తెలంగాణ
చింత గోపాల్ నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రి హరీశ్ రావు
చింత గోపాల్ నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 28, నవంబర్

సదాశివపేటలో మాజీ మున్సిపల్ చైర్మన్ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులుసంగారెడ్డి జిల్లా సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చింత గోపాల్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన చింత గోపాల్ కుటుంబ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అనంతరం చింత గోపాల్ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ప్రముఖ నాయకుల రాకతో గృహప్రవేశ వేడుక సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్ స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: