తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 29
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన మార్కంటి శ్రీను కూతురు మార్కంటి పూజ (22) తేది 28న అదృశ్యమైంది. ఉదయం తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా సాయంత్రం 5 గంటలకు పూజ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పూజ కనిపించలేదు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.ఆమె తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు వెల్దుర్తి ఎస్సై కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు.ఎత్తు సుమారు 4 అడుగులు, తెల్లటి ఛాయ, ఇంటి నుంచి వెళ్లేటప్పుడు లైట్ బ్లూ రంగు పంజాబీ డ్రెస్సు, ప్యాంట్ ధరించి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ కు 8712657890, 8712657931 కి సమాచారం అందించగలరు.



