తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ఏప్రిల్ 10
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ముదిరాజులను బీసీ-డీ (BC-D) నుండి బీసీ-ఏ (BC-A)లోకి చేరుస్తామన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కడం అన్యాయం. ఏప్రిల్ 10 శుక్రవారం గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ముదిరాజ్ నాయకులను, ముదిరాజ్ ప్రజలను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నారు ముదిరాజ్ హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామీ కమని అన్నారు ముదిరాజ్ కులానికి మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజుల కు వర్గీకరణ మార్పుపై ఇచ్చిన హామీ కేవలం ఓట్ల కోసమేనా? రెండు ఏళ్లు దాటినా ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం ముదిరాజ్ సమాజాన్ని వంచించడమే అనేది వాస్తవం.అణచివేత ధోరణి: కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలపడానికి హైదరాబాద్ లో జరగబోయే హలో ముదిరాజ్ చలో గాంధీభవన్ ముట్టడి కి వెళ్తున్న వారిని అర్ధరాత్రి నుంచి ఇళ్లల్లోనే గృహనిర్బంధం చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రభుత్వ పిరికిపంద చర్య. అని అన్నారు రాజకీయ, ఆర్థిక వివక్ష తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను రాజకీయంగా, ఆర్థికంగా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల ముదిరాజ్ బిడ్డల భవిష్యత్తు అంధకారమవుతోంది. అని అన్నారు ప్రభుత్వానికి ఇది హెచ్చరిక, లాఠీలతోనూ, అరెస్టులతోనూ ఉద్యమాలను ఆపలేరు. ముదిరాజుల ఆగ్రహానికి గురైన గత ప్రభుత్వమూ మనుగడ సాగించలేదు. అనేది గతంలో కామారెడ్డి ముదిరాజుల ధర్మ యుద్ధం ర్యాలీ ఒక నిలువెత్తు సాక్షంగా ఆనాటి ప్రభుత్వాన్ని కూల్చడానికి మొదటిగా అడుగుగా కామారెడ్డి నుండి ప్రారంభమైందనేది ఈరోజు ఉన్న ప్రభుత్వం గమనించాలి ముదిరాజులు ఏకమైతే ఏమవుతుందో ఆలోచన చేసి ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏ లోకి తక్షణమే చేర్చాలి ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మారుస్తామని ఆరోజు స్వయంగా ఈ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు మాట ఇచ్చి మోచేతికి బెల్లం పెట్టినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు తక్షణమే ముదిరాజులను బీసీ డీ నుంచి డి సి ఏ లోకి మార్చాలి అని నీలకంఠ ముదిరాజ్ డిమాండ్ చేశారు తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజ్ జర్నలిస్టులు అంతా ఏకమై ముదిరాజులను ఏకం చేసి ముందుండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి వెంటనే వర్గీకరణ ప్రక్రియను చేపట్టాలి. అన్నారు ముదిరాజ్ జాతి డిమాండ్లు 1. అరెస్టు చేసిన ముదిరాజ్ నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి అన్నారు 2. బీసీ-డీ నుండి బీసీ-ఏ కి మార్చే ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలి. 3. ముదిరాజులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన ముదిరాజుల వాటా మేమెంతో మాకంత అనే విధంగా వాటా కనిపించాలి .ముదిరాజుల ఆత్మగౌరవం కోసం, ముదిరాజ్ హక్కుల సాధన కోసం చేస్తున్న ఈ పోరాటం ఆగదు. అని హెచ్చరించారు ప్రభుత్వం దిగివచ్చే వరకు ముదిరాజులు చేసే ఉద్యమం ఇంకా ఉదృతం చేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ జర్నలిస్టులు మనస్ఫూర్తిగా పనిచేయాలని బాధ్యతగా పనిచేయాలని కోరుతూ ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసే వరకు కొనసాగుతూనే ఉంటుంది. అన్నారు అని తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం ముదిరాజ్ అన్నారు

