Saturday, May 23, 2026
HomeUncategorizedరఘునాధపాలెంలో అటవీక రాజ్యం

రఘునాధపాలెంలో అటవీక రాజ్యం

📰 Generate e-Paper Clip

లంబాడీల పై దాడి  పైగా కేసు నమోదు  అతిగతి లేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ  గత కొన్ని సంవత్సరాల నుండి బాధితుల వేదన  జిల్లా కలెక్టర్ సి పి లకు సైతం ఫిర్యాదు న్యాయం లభించని పక్షంలో ఆత్మహత్య మాత్రమే శరణ్యం   బాధితుల గోడు 

తెలంగాణ కెరటం  ఖమ్మం ,  జిల్లా ప్రతినిధి  ఏప్రిల్ 8 :

జిల్లా కేంద్రంలో ఖమ్మం నగరంకు కూత వేటు దూరంగా మండల కేంద్రమైన రఘునాధ పాలెం లో ఇంకా ఆటవిక రాజ్యం అవ లక్షణాలు మిగిలి ఉన్నాయ్ అన్న దానికి దృష్ట్యాంతం ఇది. అప్పు తీసుకొని ఆ అప్పును చెల్లించినప్పటికీ … ఆ అప్పు తాలుకు ప్రామిసరీ నోటు ఇతర కాగితాలు ఇవ్వకుండా తమ అప్పును  చెల్లించాలని దాడి చేయడమే కాకుండా కోర్టులో కేసు వేయడం విశేషం. బాధిత దంపతులు ఈ మేరకు అందజేసిన వివరాల ప్రకారం….. స్థానికంగా నివాసముండే వాంకుడోత్ మానక అనే వ్యక్తి తన కుటుంబ అవసరాల నిమిత్తం గ్రామాల్లో కొంతమంది నుండి అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. సుమారు ఆపు 7 లక్షల  68 వేల రూపాయలు కాగా కొంతకాలం తర్వాత వీరందరి అప్పులు తీర్చాడు. గ్రామంలో పెద్దమనిషి మంద వెంకటయ్య ప్రాతినిధ్యంతో జంపాల వెంకటేశ్వర్లు దగ్గర కూడా అప్పు తీసుకోవడం తీర్చడం కూడా జరిగిపోయింది. ఇదంతా 2021 వ సంవత్సరంలో జరిగిన సంఘటన. ఇదే సమయంలో ఇదే సంవత్సరంలో జంపాల వెంకటేశ్వర్లు వద్ద అప్పు తీసుకున్న  వాంకుడోత్  మానక … ఒక వాయిదా చెల్లించగా రెండో వాయిదాకి కాస్తంత సమయం ఆలస్యం అడంతో జంపాల వెంకటేశ్వర్లు అప్పు తీసుకున్న మానక ఇంటికి  దాడి కు దిగగా మానక లేకపోవడంతో అతడి భార్యపై దాడి చేశారు. ఆ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం రఘునాథ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆ కేసు అతిగతి లేదు. దాడి చేయడమే కాకుండా అప్పు చెల్లించినప్పటికీ మానక కు సంబంధిత అప్పుతాలుకు ప్రామిసరీ నోట్లు ఇతర కాగితాలు అప్పగించలేదు. కోర్టులో  కేసు కారణం గా సాకు చూపి …. సుమారు ఐదు సంవత్సరాలు గడిచి ఆరు సంవత్సరాల ప్రాయంలో ఈ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడం తీవ్రమైన మానసిక క్షోభను, తరచూ కోర్టులు నుండి నోట్టీసులు రావడం  ఒత్తిడికి గురవడం జరుగుతుందని మానక దంపతులు వాపోయారు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో జిల్లా కలెక్టర్కు ఖమ్మం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం లభించని సమక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments