Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 08:26 PM | 15 | Politics, తెలంగాణ
రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు

 తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి


కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచన
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.
సదాశివపేట మండలం పెద్దాపూర్ రైతు వేదికలో నందికంది పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులందరికీ సమాన ప్రాధాన్యత కల్పించాలని, దళారీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించాలని సూచించారు. ప్రతి క్వింటాల్ సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను తప్పనిసరిగా అందించాలని, గత ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను సైతం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు
రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, పంట రుణాలు, ఎరువుల కొరత వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని పేర్కొన్న ఎమ్మెల్యే గారు … రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాముగోపాల్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, చక్రపాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సుధాకర్, లక్ష్మారెడ్డి, సర్పంచ్ అశోక్ గౌడ్, రాజు, మనీష్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: