Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో

Author
Posted By TELANGANA KERATAM
| 04 Nov 2026, 06:54 AM | 35 | Crime, తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో
తెలంగాణ, కెరటం, స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్
​సంగారెడ్డి: ఎరువుల వ్యాపారం నిరాటంకంగా సాగేందుకు రూ. 20,000 లంచం తీసుకుంటూ సదాశివపేట మండల వ్యవసాయ అధికారి (ఏ ఓ) జి. రమేష్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
​ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్ షాపును ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు ఏవో రమేష్ మొత్తం రూ. 30,000 డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న ముందస్తుగా రూ. 10,000 స్వీకరించారు. మిగతా రూ. 20,000 లంచం సొమ్మును తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు.
​ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లంచం డిమాండ్ చేసిన ఏవో రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌లోని రెండవ అదనపు ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: