Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు:మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్

Author
Posted By TELANGANA KERATAM
| 04 Nov 2026, 07:08 AM | 3 | Crime, తెలంగాణ
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు:మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు:మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల జిల్లా...
మంచిర్యాల జోన్ పరిధిలోని నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి షిర్కే కాలనీలో సోమవారం అర్ధరాత్రి మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
శ్రీరాంపూర్ సీఐ అశోక్, ఎస్‌ఐ తహసీనుద్దీన్ లతో కలిసి డీసీపీ తనిఖీలు నిర్వహిస్తూ రౌడీషీటర్లు,సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులతో పాటు అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా వాహనాలపై తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన యువకులను గుర్తించి విచారించారు.ఈ సందర్భంగా డీసీపీ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ,రాత్రి వేళల్లో అనవసరంగా సంచరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినా, నేరప్రవృత్తిని కొనసాగించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు, నేరాల తీవ్రతను బట్టి రౌడీషీట్లు తెరిచి కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: