Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ధర్మాజీపేట 9వ వార్డులో టు బిహెచ్కె పట్టా సర్టిఫికెట్ల పంపిణీ

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 07:38 AM | 3 | తెలంగాణ
ధర్మాజీపేట 9వ వార్డులో టు బిహెచ్కె పట్టా సర్టిఫికెట్ల పంపిణీ
ధర్మాజీపేట 9వ వార్డులో టు బిహెచ్కె పట్టా సర్టిఫికెట్ల పంపిణీ

దుబ్బాకప్రతినిధి, నవంబర్ 05, తెలంగాణ కెరటం:
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 9వ వార్డుకు చెందిన గంగిరెద్దుల సామాజిక వర్గనికి చెందిన లబ్ధిదారులకు టు బిహెచ్కె పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, జిపిఓ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు పట్టా సర్టిఫికెట్లు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంలో నిరంతరం కృషి చేస్తామని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు బత్తుల స్వామి, లోకనీ మల్లేశం, కోలబోయిన రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: