నల్లమల కొండల్లో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో జరిగిన హనుమాన్ మాల ధారణ పాల్గొన్న ఎమ్మెల్యే.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11):
నల్లమల కొండల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రంలో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హనుమాన్ మాలాధారణ గావించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, హనుమాన్ స్వాములతో కలిసి ఆయన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాల కోసం ప్రార్థించారు. ఉమామహేశ్వర క్షేత్రానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ బిరం మాధవరెడ్డి, పాలక మండలి సభ్యులు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు భక్తులు పాల్గొన్నారు.
