కోదాడ: కోదాడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) డి. రామకృష్ణ రెడ్డి గారిని చేకూరి నవీన్, సుంకరి నాగయ్య ఘనంగా సన్మానించారు. ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను అభినందిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ డి. రామకృష్ణ రెడ్డి గారిని శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న ఆయన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని చేకూరి నవీన్, సుంకరి నాగయ్య కొనియాడారు.



