Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీగా నలువాల శ్రీకాంత్ గౌడ్‌ను గెలిపించాలి

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:10 AM | 6 | Politics, తెలంగాణ
సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీగా నలువాల శ్రీకాంత్ గౌడ్‌ను గెలిపించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రక్షణ సేన నాయకుల విజ్ఞప్తి

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 15:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్ష్యాలు నెరవేరాలంటే సామాజిక న్యాయం సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని,అందుకోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆశీస్సులతో బరిలో నిలిచిన డాక్టర్ నలువాల శ్రీకాంత్ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం  తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీడియా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆదివాసీలు,గిరిజనులు, బహుజనులు సహా అనేక వర్గాల ప్రజలు కీలక పాత్ర పోషించారని,ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడుస్తున్నా సామాజిక న్యాయం, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాలు వంటి కీలక అంశాల్లో ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేక పోయాయని విమర్శించారు.భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైందని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకుల హామీలు, మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితి లేదని, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఉద్యమాల గడ్డ ములుగు నుంచి బీసి బిడ్డగా అవకాశం కల్పించాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలువాల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాగృతి కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు గత టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. ములుగు వంటి ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి,బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుండటం ఆందోళనకరమని, పట్టభద్రులు డబ్బుకు కాకుండా ప్రజాసమస్యలపై పోరాడే అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. తనను గెలిపిస్తే యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ ఉద్యమం నీళ్లు,నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తుచేస్తూ.. నేటికీ నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న అనేక విశ్వవిద్యాలయాల్లో మౌళిక సదుపాయాల కొరత,ఉద్యోగ నియామకాలలో జాప్యం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సుమారు ఐదు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జరిగిన పరిణామాలు పట్టభద్రుల్లో తీవ్ర నిరాశను కలిగించాయని విమర్శించారు.ఉద్యోగ క్యాలెండర్ లేకపోవడం, నోటిఫికేషన్లలో జాప్యం, పేపర్ లీకేజీలు నిరుద్యోగ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు.
ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ,ఇంక్రిమెంట్లు, ఇతర పెండింగ్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని పేర్కొన్నారు.
ఆదివాసీ ప్రాంతాల సహజ వనరుల దోపిడీని అడ్డుకోవాలి
సమ్మక్క-సారలమ్మ పోరాట స్ఫూర్తి కలిగిన ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోని అడవులు, సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు.సహజ వనరుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి సీతక్కపై పలు విమర్శలు చేస్తూ, ఇసుక రవాణా, సహజ వనరుల వినియోగం, శ్రీనిధి పథకం అమలులో పారదర్శకత పాటించాలని అన్నారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.అలాగే బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై విమర్శలు చేశారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, సొంత భవనాల కొరత, స్వేరో విద్యార్థుల ఇబ్బందులపై ఆయన స్పందించాలని అన్నారు. బహుజన, పేద విద్యార్థుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన నాయకులు ప్రజల పక్షాన నిలవాలని సూచించారు.
ఎస్సీ,ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసే అంశంలో తెలంగాణ రక్షణ సేన కృషి చేసిందని పేర్కొంటూ,సామాజిక న్యాయంబీసీల రాజకీయ ప్రాతినిధ్యం,
విశ్వవిద్యాలయాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడికి పట్టం కట్టాలి
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పట్టభద్రుల సమస్యలను పట్టించుకునే నాయకత్వం అవసరమని, నిరుద్యోగులు,ఉద్యోగులు, విద్యార్థులు,బీసీ వర్గాల హక్కుల కోసం పోరాడే డాక్టర్ నలువాల శ్రీకాంత్ గౌడ్‌కు పట్టభద్రులు మద్దతు తెలపాలని నాయకులు కోరారు. నల్గొండ,ఖమ్మం,ఉమ్మడి వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి సామాజిక న్యాయానికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు.డబ్బు రాజకీయాలకు,హామీల రాజకీయాలకు ముగింపు పలికి బీసీ బిడ్డగా, విశ్వవిద్యాలయ విద్యార్థుల పక్షాన నిలిచే శ్రీకాంత్ గౌడ్‌కు అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: