- 5.100 వ్యయంతో నిర్మాణం
-ముందుకొచ్చిన ఎకోపామ్ ఆయిల్ పరిశ్రమ
- సీఎం రేవంత్ రెడ్డి చేత భూమిపూజ
-హకీంపేటలో 30ఎకరాల భూమి కేటాయింపు
-వికారాబాద్ జిల్లాలో 4,500 ఎకరాల్లో పంట సాగు తెలంగాణ కెరటం, తాండూర్ ప్రతినిధి:సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ రిఫైనరీ ఏర్పాటుకు మహర్తం ఖరారైంది. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. రిఫైనరీ నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని హకీంపేటలో ఎకో పామ్ ఆయిల్స్ పరిశ్రమకు కేటాయించారు. వంట నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్న వారి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల సాగును రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆయిల్ పామ్ మిషన్ కింద ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ఆయిల్ పామ్ తోటలకు తోడ్పాటును అందిస్తోంది. ప్రతి జిల్లాను యూని ట్ గా తీసుకొని తోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితమే జిల్లాల వారిగాసం స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచుతున్నారు. ఉద్యాన శాఖతో కలిసి ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. వికారాబాద్ తో పాటు నారాయణపేట జిల్లాలకు సంబంధించి ఎకో పామ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్పరిమిత పరిశ్రమతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థగత ఐదేళ్లుగా జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహిస్తోంది.
లక్ష్యం 10వేల ఎకరాల్లో సాగు.. తాజాగా తాండూరు, వికారాబాద్, కొడంగల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇసుక భూముల్లో ఎక్కువగా రెండు జిల్లాలకు ఒకే పరిశ్రమ.
దుద్యాల మండలంలో ఏర్పాటు కోసం సన్న హాలు
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో ఆయిల్ పామ్ రిఫైనరీ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం 30ఎకరాలను కేటాయించింది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో చదివే పనులను చేపట్టారు. అక్కడ రూ.100 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ గెలలను ప్రాసెసింగ్ చేసే పరిశ్ర మను ఏర్పాటు చేస్తారు. 8న రైతుమేళాతో పురస్కరిం చుకొని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ రిఫైనరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఏడాది కాలంలో రిఫైనరీ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయడం ఎకో పామ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. కొడంగల్ లో ఏర్పాటు అయ్యే ఆయిల్ పామ్ రిఫైనరీకి వికారాబాద్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలలో రైతులు ఉత్పత్తి చేసే ఆయిల్ పామ్ గెలలను విక్రయించాల్సి ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో ప్రభుత్వంతో ఒప్పందం మేరకు 20వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేందుకు పామ్ ఆయిల్స్ పరిశ్రమ చర్యలు చేపడుతుంది.
4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు
ఈ తోటలను సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు అవుతున్నాయి. ఎకో పామ్ అయిల్స్ యాంట్ ఫ్యాట్స్ సంస్థకు 10 వేల ఎకరాల సాగును లక్ష్యంగా నిర్దేశించారు. గత వర్షాకాలం నుంచి వాతావరణం ప్రతికూలంగా మారడంతో తోటల సాగు నెమ్మదించింది. నారాయణపేట జిల్లా కూడా అయిల్ పామ్ తోటల సాగును ఎకో పామ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ఈ రెండు జిల్లాలకు కలిసి కొడంగల్లో రిఫైనరీ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. గత ఆరు మాసాలుగా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు ఏకో పామ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొడంగల్లో రిఫైనరీ ఏర్పాటు సంస్థ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రతిపాదనను అంగీకరించింది.
