Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కరువు కోరల్లో వికారాబాద్ జిల్లా

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:27 AM | 6 | TELANGANA, తెలంగాణ
-కరువులో రాష్ట్రంలో టాప్-రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులు-అడుగంటుతున్న భూగర్భ జలాలు-అధికారులు పట్టించుకోని ప్రభుత్వం-ఒకప్పుడు వ్యవసాయంలో మేటి-నేడు దీనస్థితిలో వికారాబాద్ జిల్లా-వికారాబాద్ ఏర్పాటు 5 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
-కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ మండలాల్లో కరువు ఛాకలర్ టెక్స్ట్ యలు
-అధిక లోటు వర్షపాతంతో ఎండుముఖం పట్టిన మొక్కజొన్న, పత్తి పంటలు
-మరో వారంపాటు వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు
-ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే వ్యవసాయాధికారుల అవగాహన
-ఇప్పటివరకు 3,19,039 ఎకరాల్లో సాగు 

తెలంగాణ కెరటం,తాండూర్, ప్రతినిధి:జిల్లాలో

ఎల్నినో ప్రభావం. నైరుతి రుతుపవనాల అనిశ్చితితో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చినా అనుకున్న స్థాయిలో వానలు కురవ పంట పంటలు ఎందుముఖం పడుతున్నాయి. జిల్లా కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ మండలాల్లో అధిక లోటు వర్షపాతం నమోదు కావడంతో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండిపోతున్నాయి. మరో వారం రోజు లు వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొందివ్యవసాయాధికారులు వెల్లడిస్తున్నారు. మళ్ళీ అప్పులు చేసివిత్తనాలను నాటిన రైతులు పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు బిందెలతో పంటలకు నీరు అందించారు. వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా పదిహేను రోజుల ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఆగష్టు 15 నుంచి అక్టోబర్ 31 వరకు వర్షాలు కురవకపోతే ఏ ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. ఆగస్టు 15 అక్టోబర్ 15 వరకు వర్షాలు కురవకపోతే ఏయే పంటలు వేయాలంటే దానిపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 15 వరకు వర్షాలు కురవకపోతే ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించనుంది.

ఐదు మండలాల్లో తీవ్ర వర్షాభావం
ఐదు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. వాసకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. జిల్లాలో సాధారణం కంటే లోటువర్షపాతంనమోదైంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు సాధారణ వర్షపాతం 185.2 మి.మీటర్లు కురువాల్సి ఉండగా 114.1 మి.మీటర్లేనమోదైంది. ఐదు మండలాల్లో అధిక లోటు వర్షపాతం, మరో 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా కులకచర్ల, బంట్వారం, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ మండలాల్లో సాధారణం కంటే 60 శాతం నుంచి 99 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైంది. కులకచర్ల మండలంలో సాధారణ వర్షపాతం 172.8మి.లు కాగా కేవలం 42.6 మి.మీటర్లు నమోదుకాగా, 75 మీ.మీటర్లు, బంట్వారం మండలంలో సాధారణ వర్షపాతం 195.2మి. మీటర్లు కాగా కేవలం 26 మి.మీ.లు, పెద్దేముల్ మండలంలో సాధారణ వర్షపాతం 207.4 మి.మీటర్లుకాగా, 17.9 మి.మీటర్లు, బషీరాబాద్ మండలంలో సాధారణ వర్షపాతం 191.9మి.మీటర్లుకాగా, 29.6 మి.మీటర్లు, కొడంగల్ మందంలో సాధారణ వర్షపాతం 181.6మి. మీటర్లుకాగా, 38.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.
 ఐదు మండలలో లోటు వర్షపాతం
జిల్లాలో లోటు వర్షపాతం నమోదైన మండలాల్లో, మర్పల్లి మండలంలో సాధారణ వర్షపాతం, 173.1 మి.మీటర్లు కాగా, 79.1 మి.మీటర్లు, నవాబుపేటలో 180.5 మి.మీటర్లకు 119 మి.మీటర్లు, పరిగిలో 180.6 మి. మీటర్లకు 125 మి. మీటర్లు. దోసులో 173.8 మి.మీటర్లకు 98 మి.మీటర్లు. ధారూరులో 199.2 మి. మీటర్లకు గాను 105.4 మి.మీటర్లు, కోట్పల్లిలో 194.2 మీ.మీటర్లకుగాను 985 మి.మీ.లు. తాండూరులో 205.7 మి.మీటర్లకుగాను 103 మి.మీటర్లు, యాలాలలో 189.5 మి.మీటర్లకుగాను 111.4 మి.మీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 168.8 మీ.మీటర్ల వర్షపాతానికి గాను 78.5మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.ఇప్పటివరకు 3,19,039 ఎకరాల్లో సాగు జిల్లాలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 4,85,849 ఎకరాలుగా ఇప్పటివరకు 3.19,039 ఎకరాల్లో ఆయా పంటలను సాగు చేశారు. పత్తి 2,08,147 ఎకరాలు. కందులు 80,502, మొక్కజొన్న 21,704, పెసలు 2,296, జొన్న 163, మినుములు 723, సోయాబీన్ 930, ఇతర పంటలు 1,874, ఉద్యానవన పంటలు 1,560 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండుముఖం పట్టాయి. పంటలు ఎండుముఖం పడుతున్నదృష్ట్యా జిల్లా వ్యవసాయాధికారులు ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్లించేలా ప్రణాళికను రూపొందించారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: