Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అయ్యప్ప ఆలయ అధ్యక్షుడిగా మరోసారి అంబటి శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 07:37 AM | 6 | Politics, తెలంగాణ
అయ్యప్ప ఆలయ అధ్యక్షుడిగా మరోసారి అంబటి శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 15 : కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్ గురుస్వామిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో ఆయన అందిస్తున్న సేవలు, భక్తులకు అందుబాటులో ఉంటూ ఆలయ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న తీరు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ, శాశ్వత సభ్యులు ఆయనకు తిరిగి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. కోరుట్ల పట్టణ అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక శాశ్వత గౌరవ అధ్యక్షులు చిద్రాల నారాయణ గురుస్వామి అధ్యక్షతన ఆదివారం ఆలయ శాశ్వత సభ్యుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ నిర్వహణ, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలు, స్వామివారి పూజా కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆలయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టగా, ప్రస్తుత అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురుస్వామి పేరును సభ్యులు ప్రతిపాదించారు. దీనికి సమావేశంలో పాల్గొన్న శాశ్వత సభ్యులందరూ సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆయనను మరోసారి ఆలయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అంబటి శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ.. 05 కోట్ల వ్యయంతో ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ శివాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తానని, నిర్మాణ పనులు ప్రారంభమైనందున దాతలు, కమిటి సభ్యులు తమవంతు సహకరం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గురుస్వాములు మంచాల సుధాకర్, రాజలింగం, గడ్డం మధు, గండ్ర రాజు, గాజెంగి లక్ష్మిపతి, జుంబర్తి రమేష్, కాసు క్రాంతి, గ్యాద సాయి, దగ్గుల నర్సయ్య కుందారపు జితేందర్, ఒడ్నాల రాకేష్, శ్రీరాముల శ్రీనివాస్, శాశ్వత సభ్యులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: