Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సగరుల హక్కుల సాధనకై రేపు కలెక్టరేట్ ముట్టడి

Author
Posted By TELANGANA KERATAM
| 16 Nov 2026, 08:09 AM | 8 | Politics, తెలంగాణ
సగరుల హక్కుల సాధనకై రేపు కలెక్టరేట్ ముట్టడి

 నిరసన కార్యక్రమానికి భారీగా తరలిరావాలి: రవి సాగర్

 కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 15

 సగరుల హక్కుల సాధన కోసం మెదక్ జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం, కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు సగర సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రవి సాగర్ తెలిపారు. సగరుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.సగర సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు వెల్లడించారు. సగరుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమం కేవలం కొంతమంది వ్యక్తుల పోరాటం కాదని, సగర సామాజిక వర్గం భవిష్యత్తు, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన ఉద్యమమని తెలిపారు. అందువల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న సగర సంఘం నాయకులు, సభ్యులు, యువత, కుల బాంధవులు కుటుంబ సమేతంగా కాకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.సగరుల ఐక్యతను చాటుతూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడి, శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రవి సాగర్ మాట్లాడుతూ సగరుల హక్కుల సాధనే తమ ప్రధాన లక్ష్యమని, డిమాండ్ల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నెల 16న సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి జిల్లా సగర సంఘం సభ్యులందరూ అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని కోరారు.
జై సగర.. జై భగీరథ.. జై శ్రీరామ్.. అని పిలుపునిచ్చారు.
ఇట్లు: మెదక్ జిల్లా సగర సంఘం
రవి సాగర్
సగర సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: