తెలంగాణ కెరటం ప్రజా ప్రతినిధి శివకుమార్ నవంబర్ 16
నర్సాపూర్: మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్‌లో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామ సర్పంచ్ చార్ల మణిదీప్ మాట్లాడుతూ.. లింగాపూర్ గ్రామానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో భరోసా నింపుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చార్ల మణిదీప్ పేర్కొన్నారు.



