Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పింఛన్లు ఇచ్చారు.. పెంచడం మరిచారా?

Author
Posted By TELANGANA KERATAM
| 17 Nov 2026, 06:26 AM | 6 | Politics, తెలంగాణ
పింఛన్లు ఇచ్చారు.. పెంచడం మరిచారా?
పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మల్లారెడ్డి విజ్ఞప్తి
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్‌కేసర్, పోచారం, ఎదులాబాద్, నాగారం 4 డివిజన్లకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 6 వేల మందికి పైగా లబ్ధిదారులకు నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం పింఛన్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే కొత్తగా పింఛన్లు మంజూరు చేసినప్పటికీ గతంలో ఇస్తున్న పింఛను మొత్తాన్నే కొనసాగించడం బాధాకరమని అన్నారు. ప్రస్తుత ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పింఛను మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెరిగిన పింఛను మొత్తం మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: