జగిత్యాల జిల్లా బంజారా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల భూమిపూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న బంజారా సంఘం ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆధ్యాత్మికత, భక్తి భావాలతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంజారా సంఘం అభివ్రుద్ది కి,బంజార ల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య గారు, జగిత్యాల జిల్లా సేవాలాల్ కమిటీ అధ్యక్షులు భూక్య నందు నాయక్,జగిత్యాల రాయికల్ amc చైర్మెన్ లు గడ్డం నారాయణ రెడ్డి రవీందర్ రావు స్తానిక కౌన్సిలర్ ప్రశాంత్ రావు జిల్లా మహిళా అధ్యక్షురాలు అడువల జ్యోతి లక్ష్మణ్
బంజారా సంఘం ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



