నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో పదేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేద ప్రజల కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముధోల్ మండలానికి సంబంధించి 487 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి.
దీంతో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు మరియు మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం ప్రత్యేక కృతజ్ఞత సభ నిర్వహించారు. గత పదేళ్లుగా పెన్షన్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారందరికీ న్యాయం జరిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) అలాగే ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ముధోల్ మండల ప్రజలు మరియు లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



