Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Author
Posted By TELANGANA KERATAM
| 17 Nov 2026, 06:51 AM | 8 | Politics, తెలంగాణ
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు
చేయూత పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
- మేడ్చల్ నియోజకవర్గంలో 6 వేల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు.. ఘట్‌కేసర్ సర్కిల్‌లో 900 మందికి పైగా మంజూరు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 16: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం, ఘట్‌కేసర్, ఎదులాబాద్, పోచారం నాలుగు డివిజన్లకు చెందిన 900 మందికి పైగా లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరు పత్రాలను పంపిణి చేశారు. అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం వ్యాప్తంగా 6 వేల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, నాణ్యమైన విద్యతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్, ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ కమిషనర్ వాణి రెడ్డి, స్థానిక ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: