Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్తీకమాస పర్యటనలో చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామి.. ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Author
Posted By TELANGANA KERATAM
| 17 Nov 2026, 07:05 AM | 5 | Politics, తెలంగాణ
కార్తీకమాస పర్యటనలో చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామి.. ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కార్తీకమాస పర్యటనలో చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామి.. ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 16, నవంబర్
సదాశివపేట పట్టణంలోని చీల మల్లన్న వ్యవసాయ క్షేత్రం ఫామ్‌హౌస్‌లో కార్తీకమాస పర్యటనలో భాగంగా విచ్చేసిన జ్ఞాన సింహాసనాధీశ్వర 1008 డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య మహాస్వామి వారిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మహాస్వామి వారికి పండ్లు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. మహాస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. కార్తీకమాస పర్యటనలో భాగంగా స్వామివారి ఆధ్యాత్మిక సందేశాలు, ఆశీస్సులు భక్తులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దూది రామ్ చెట్టి, మట్టం రాచన్న స్వామి, శ్రీశైలం, ఈశ్వరప్ప, చుందు స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: