Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Author
Posted By Kancharala Shivakumar
| 17 Nov 2026, 07:21 PM | 30 | తెలంగాణ
దుబ్బాక నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయండి -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, తెలంగాణ కెరటం:

దుబ్బాక నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా మారి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్ల మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కోరారు.
ఈ మేరకు మంగళవారం మంత్రిని కలిసి నియోజకవర్గంలోని రహదారుల సమస్యలను వివరిస్తూ లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. తొగుట, భూంపల్లి, దుబ్బాక మండలాల్లో హై లెవల్ బ్రిడ్జిల (HLB) నిర్మాణంతో పాటు మొండి చింత–బేగంపేట రోడ్డు, భూంపల్లి–దొమ్మాట రోడ్డు, హబ్సిపూర్–దుబ్బాక రోడ్డు, దుబ్బాక–మెదక్–సిద్దిపేట రహదారి, మెట్టు–దౌల్తాబాద్ రోడ్డు తదితర మార్గాల పునరుద్ధరణ, రెన్యూవల్ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు దెబ్బతినడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, ఆయా పనులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: