Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బల్మూరు మండల బిజెపి మోర్చా మండల కమిటీ నియామకం.

Author
Posted By TELANGANA KERATAM
| 18 Nov 2026, 08:11 AM | 4 | Politics, తెలంగాణ
బల్మూరు మండల బిజెపి మోర్చా మండల కమిటీ నియామకం.
బల్మూరు మండల బిజెపి మోర్చా మండల కమిటీ నియామకం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 17):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండల కేంద్రంలోని ఉపసర్పంచ్ సీతారాం రెడ్డి నివాసంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ బలమూరు మండలంలోని వివిధ మోర్చాల మండల కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షులు బాలస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో మోర్చాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన మోర్చా అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. బల్మూరు మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులుగా వాలువాయి బాలస్వామి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీను, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా రాధా నియమితులయ్యారు. నూతనంగా మోర్చా అధ్యక్షులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి నాయకత్వంలో ఆయా మోర్చాలని మరింత చురుకుగా పనిచేసే బిజెపి బలవపై కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: