Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేదలకు భరోసాగా చేయూత పింఛన్ పత్రాల అందజేత.

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 07:59 AM | 5 | Politics, తెలంగాణ
పేదలకు భరోసాగా చేయూత పింఛన్ పత్రాల అందజేత.
*పేదలకు భరోసాగా చేయూత పింఛన్ పత్రాల అందజేత..* 

– నూతన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ప్రొసీడింగ్స్ అందజేసిన గ్రామ సర్పంచ్ నూకల రాము

తెలంగాణ కెరటం – మనోహరాబాద్:

మనోహరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించిన 16 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ప్రొసీడింగ్స్‌ను గ్రామ సర్పంచ్ నూకల రాము అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. పింఛన్లతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బద్రి మాధవి,వార్డు సభ్యులు గొల్లపల్లి సత్యనారాయణ,భాస్కర్,బాబు,శ్రీకాంత్, గొల్ల రాధ,చింతల రేణుక,బాలమణి, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: