Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 07:56 AM | 10 | Politics, తెలంగాణ
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం

తెలంగాణ కెరటం – జగిత్యాల
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం
జగిత్యాల: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.
నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జగిత్యాల జిల్లాలో 20 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 481 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబ ప్రధాన సంపాదనపరులకు ఈ పథకం వర్తించనుంది. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల ఆర్థిక భరోసా అందించనున్నారు.
అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరుతున్నాం.
ఇట్లు రంజిత్ పాంపర్తి తెలంగాణ కెరటం జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: