Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

10+2 విద్యా విధానంపై వెంటనే స్పష్టమైన G.O. జారీ చేయాలి....

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 11:14 AM | 2 | Politics, తెలంగాణ
10+2 విద్యా విధానంపై వెంటనే స్పష్టమైన G.O. జారీ చేయాలి....

 ఇంటర్ కళాశాలలకు 9, 10 తరగతుల అనుమతిని విరమించుకోవాలి....

ప్రైవేట్ పాఠశాలలకు 11, 12 తరగతులు నిర్వహించే అవకాశం కల్పించాలి.....

బడ్జెట్ పాఠశాలల మనుగడను దెబ్బతీయొద్దు: ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు.తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....
మంచిర్యాల..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10+2 విద్యా విధానాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రాస్మా) స్వాగతిస్తోందని సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు. అయితే ఈ విధానం అమలు పేరుతో ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు.
పదో తరగతి అనంతరం వివిధ సామాజిక, ఆర్థిక కారణాలతో కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో భాగం చేయాలనే ప్రభుత్వ ఆలోచన విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య కొనసాగింపు అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.
అయితే 10+2 విధానం లక్ష్యం పదో తరగతి వరకు గుర్తింపు కలిగిన పాఠశాలలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయడంగా ఉండాలని, ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతులు నిర్వహించే అవకాశం కల్పించడం సరికాదని స్పష్టం చేశారు.
ఇప్పటికే తక్కువ ఫీజులతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్య అందిస్తున్న వేలాది బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల మనుగడకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గితే వాటిపై ఆధారపడిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉపాధి కూడా ప్రభావితమవుతుందని తెలిపారు.
ప్రస్తుతం పదో తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపుతో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన విద్యా ప్రమాణాలు, భద్రతా నిబంధనలకు లోబడి, అనవసరమైన ఆర్థిక భారం మోపకుండా 11, 12 తరగతులు నిర్వహించేందుకు అఫిలియేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 2027–28 విద్యా సంవత్సరంలో అదే పాఠశాలలో 11వ తరగతి కొనసాగించవచ్చా? లేక ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేరాలా? అనే విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 10+2 విద్యా విధానం అమలు, పాఠశాలల అప్‌గ్రేడేషన్, అఫిలియేషన్, ప్రవేశాలు, పాఠ్యప్రణాళిక, పరీక్షల విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రభుత్వం తక్షణమే జి. ఓ జారీ చేయాలని కోరారు.
విద్యా సంస్కరణలు కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితం కాకుండా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు కూడా సమాన అవకాశాలు కల్పించేలా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తున్న చిన్న, మధ్యతరహా పాఠశాలలు మూతపడే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు 12వ తరగతి వరకు ఒత్తిడి లేని విద్య అందించడంతో పాటు, ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేలా పాఠ్యప్రణాళికలో తగిన మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈ విధానంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ట్రాస్మా వంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.10+2 విద్యా విధానాన్ని మేము వ్యతిరేకించడం లేదు.. స్వాగతిస్తున్నాం. అయితే పాఠశాలలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయాలి తప్ప, ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతుల అనుమతులు ఇచ్చి బడ్జెట్ పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకం చేయవద్దు. ప్రభుత్వం వెంటనే స్పష్టమైన జి. ఓ విడుదల చేయాలి అని డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు విజ్ఞప్తి చేశారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: