Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన కేరళ హైస్కూల్ విద్యార్థి అబ్దుల్ ముజిల్

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 02:32 PM | 4 | Sports, తెలంగాణ
జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన కేరళ హైస్కూల్ విద్యార్థి అబ్దుల్ ముజిల్
జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన కేరళ హైస్కూల్ విద్యార్థి అబ్దుల్ ముజిల్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎస్జీఎఫ్ lఆటల పోటీలలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా ఖాజీనగర్‌లో నిర్వహించిన కరాటే పోటీలలో కోరుట్ల పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి అబ్దుల్ ముజిల్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఫోటోఖాన్ కరాటే విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, డిసెంబర్ నెలలో మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయnస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఏ బారి, ప్రిన్సిపల్ శ్రీమతి సెలెన్ బారి, చైర్మన్ ఎం.ఏ హాది విద్యార్థి అబ్దుల్ ముజిల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఏ బారి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఇతర పాఠశాల స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, క్రీడలు ఆరోగ్యకరమైన జీవితానికి పునాది అని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ.స్థాయి పోటీలకు ఎంపికైన అబ్దుల్ ముజిల్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందిస్తూ, జాతీయస్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: