Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 03:25 PM | 10 | Politics, తెలంగాణ
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన 

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 18 :


నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో ని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీమ్స్  ప్రతినిధులు  విగ్నేష్, సుకన్య లు ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్, మహిళల భద్రత, బాలికల రక్షణకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలు ఎదుర్కొనే వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 8712659795 నంబర్లకు సమాచారం అందించాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోపారం మోహన్,ఉపాధ్యాయ బృందం.గంగమణి,సురేష్,రాజ్ నారాయణ్,రఘునాథ్,సబిత,కిరణ్,భోజన్నా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలుఎంతో ఉపయోగకరమని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు  పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: