Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బస్సు ఎక్కుతుండగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 10:47 PM | 28 | Politics, తెలంగాణ
బస్సు ఎక్కుతుండగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి
బస్సు ఎక్కుతుండగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : కోరుట్ల బస్టాండ్ లో బుధవారం రోజు సాయంత్రం బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని లక్ష్య హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్య అనే విద్యార్థిని కోరుట్లలోని మాస్ట్రో కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బుధవారం సాయంత్రం కోరుట్ల-బొమ్మెన బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బస్సు కదలడంతో అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె కుడి కాలుకు, వెన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి, అంబులెన్స్ కు సమాచారం అందించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలియజేసి, ఆమెను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాలల, కరీంనగర్, అక్కడి నుండి హైదరాబాద్ మెడి కవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నడుము భాగంలో ఎముకలు విరిగి, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం లక్ష్య మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబంలో, తకళ్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ బస్సును కదిలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: