తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 19
వనపర్తి జిల్లా 108 నియోనటల్ అంబులెన్స్ జిల్లా ఈఎంఈ దుర్గాప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. అందులోని వైద్య పరికరాలు రికార్డులను పరిశీలించారు. పుట్టిన పిల్లలతో పాటు 0 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పి హెచ్ సి సి హెచ్ సి ల నుంచి వనపర్తి ఎం సి హెచ్ ఆసుపత్రికి చిన్నారులను తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.



