Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పంటల సాగులో రైతులు సేంద్రియ పద్ధతులను పాటించాలి

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 04:56 PM | 4 | HEALTH, తెలంగాణ
పంటల సాగులో రైతులు సేంద్రియ పద్ధతులను పాటించాలి
పంటల సాగులో రైతులు సేంద్రియ పద్ధతులను పాటించాలి

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10:

రసాయన రహిత ఆహార ధాన్యాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నందున రైతులు వ్యవసాయంలో సేంద్రియ సాగు విధానాలను పాటించడం అలవాటు చేసుకోవాలి అని సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామం లో వ్యవసాయ యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ సాగు విధానాలు, జీవ ఎరువులు, నానో సాంకేతిక పరిజ్ఞానం పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఇందులో  భాగంగా ఏడిఏ మాట్లాడుతూ విచక్షణ రహితంగా వాడే రసాయనాలు, పురుగు మందుల వల్ల పంటల పెట్టుబడి పెరగడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మారాల్సిన అవసరం ఉందని రైతులను కోరారు. ఎల్ నినో ప్రభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు రబీలో వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో సస్యరక్షణ చర్యలపై ఆయా శాఖల అధికారులు రైతులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండెటీ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ మూగ చిన్న భోజన, మండల వ్యవసాయ అధికారిణి లావణ్య, మండల ఉద్యాన అధికారి రుద్రవినాయక్, ఏఈఓ రేష్మ మరియు రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: