Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఐశ్వర్య ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 08:50 PM | 44 | Crime, తెలంగాణ
ఐశ్వర్య ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్
ప్రేమ సంబంధం, వివాహ ప్రతిపాదన వివాదంపై పోలీసుల దర్యాప్తు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 20: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన ఐశ్వర్య (22) ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటనలో నిందితుడు జామ కిరణ్ కుమార్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్య మృతి ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో మృతురాలు ఐశ్వర్యకు నిందితుడు జామ కిరణ్ కుమార్‌తో ఉన్న ప్రేమ సంబంధం, వివాహ ప్రతిపాదనకు సంబంధించి ఇద్దరి మధ్య నెలకొన్న వివాదంపై వివరాలు సేకరించారు. విచారణలో లభించిన సమాచారం, సేకరించిన ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం చట్టప్రకారం తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఘట్‌కేసర్ పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: