Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అడ్వకేట్ జగన్ మోహన్*

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 11:16 PM | 4 | Politics, తెలంగాణ
జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అడ్వకేట్ జగన్ మోహన్*
*జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అడ్వకేట్ జగన్ మోహన్*

నిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్- 

అడ్వకేట్ జగన్ మోహన్
బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో భారత రాజ్యాంగ పితామహుడు,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.భారత రాజ్యాంగ రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషించిన డాక్టర్ అంబేద్కర్ గారికి దేశవ్యాప్తంగా సముచిత గౌరవం కల్పించాలి. సమానత్వం,సామాజిక న్యాయం,స్వేచ్ఛ,సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను దేశానికి అందించిన మహనీయులు అంబేద్కర్ గారు.భారత రాజ్యాంగ పితామహుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం.దేశంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటానికి సముచిత స్థానం కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి గౌరవం ఇచ్చినట్లే. కాబట్టి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి తమ ఛాంబర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: