Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి.-దుబ్బాక పురపాలిక కమిషనర్ మహేష్ కుమార్

Author
Posted By Kancharala Shivakumar
| 21 Nov 2026, 07:45 AM | 5 | తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి.-దుబ్బాక పురపాలిక కమిషనర్ మహేష్ కుమార్

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 20,(తెలంగాణ కెరటం)

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక పురపాలిక కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు.శుక్రవారం దుబ్బాక పురపాలిక కార్యాలయంలో పలువురు వార్డు కౌన్సిలర్లతో కలిసి 5 లక్షల కుటుంబ జీవిత బీమా పథకం యొక్క గోడపత్రికను ఆవిష్కరించి, ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబంలో కుటుంబ యజమాని పేరున బీమా పథకానికి దరఖాస్తు చేసుకొని, నామినీగా కుటుంబ సభ్యుల పేర్లను జత చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాల ద్వారా పురపాలిక కార్యాలయంలో గాని, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల ద్వారా బీమా పథకాన్ని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న కుటుంబ పెద్ద లేదా కుటుంబాన్ని పోషించే వ్యక్తి పేరు మీద జీవిత బీమా పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు దేవుని రాజు, అనంతుల భాగ్యమ్మ, కోలా నిరోష, బడుగు రాజు, కో ఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్, నసీమా, నాయకులు బండి రాజు అనంతుల శ్రీనివాస్, ఐరేని సాయి తేజ గౌడ్, కోలా వెంకట్ స్వామి గౌడ్, పురపాలిక మేనేజర్ శ్రీనివాస్, మెప్మా ఆర్పీలు, పుర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: