Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతు కళ్లలో ఆనందం.. పేదవాడి ఇంట్లో సంతోషం.. ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 03:10 PM | 3 | Politics, తెలంగాణ
రైతు కళ్లలో ఆనందం.. పేదవాడి ఇంట్లో సంతోషం.. ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

నూతన చెక్ డాంలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో శనివారం నూతన చెక్ డ్యామ్ భూమి పూజ మరియు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగీనేని శ్రీనివాస్ రావు కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచడానికి నూతన చెక్ డ్యామ్ నిర్మాణం. దీంతో వందలాది ఎకరాలకు సాగునీరంది, ఏడాదికి రెండు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుంది. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ కార్డుల పంపిణీ. వీటి వల్ల పారదర్శకతతో పాటు ఎక్కడి నుంచైనా సులభంగా రేషన్ తీసుకునే సౌకర్యం ఉంటుందని వ్యవసాయ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని, గ్రామ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్, అచ్చంపేట మార్కెట్ డైరెక్టర్ జనార్ధన్, ఉన్నత స్థాయి అధికారులు,స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: