కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20 :
నిజామాబాద్ జిల్లాముప్కాల్ మండలం నల్లూర్ గ్రామానికి చెందిన అక్కవత్రి ప్రవీణ్ రాధిక ల కూతురు అక్కవత్రి అరుణిమ వయస్సు ఏడు సంవత్సరాలు పుట్టుకతో వికలాంగురాలు కావడంతో శుక్రవారం రోజు ముప్కాల్ మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల మంజూరు కార్యక్రమంలో మంత్రి ధనసరి సీతక్క ముత్యాల సునీల్ కుమార్ చేతుల మీదుగా వికలాంగుల పెన్షన్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మా కూతురికి కొత్త పింఛన్ మంజూరు చేసి మా కుటుంబంలో ఆనందం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దనసరి సీతక్కకి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్న కు కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. తెలిపారు
మీరు చేసిన ఈ మేలును జీవితాంతం మరచిపోలేము. పేదలకు అండగా నిలుస్తున్న మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు.



