Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 04:07 PM | 5 | Politics, తెలంగాణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్
సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును చూసి "ఇందిరమ్మ" ఆత్మ కూడా క్షోభిస్తుంది: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ 
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేస్తూ "ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం" పేరుతో ప్రారంభించిన బీమా పథకం అమలు తీరుపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఉన్న బీమా పథకాలను అమలు చేయలేక తెలంగాణ రైతాంగం తో పాటు కల్లుగీత, మత్స్యకారులు, గౌడన్న, నేతన్న, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మరో మారు కాంగ్రెస్ ప్రభుత్వంమోసం చేస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించలేని చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రీమియం చెప్పించలేని దుస్థితిలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో డబ్బులు లేవంటూ చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతూ అబద్ధపు హామీలతో మూడు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు, వృద్ధులకు 6000 పెన్షన్ అన్నారు, వంద రోజుల్లో 6 గ్యారంటీ, 13 డిక్లరేషన్లను అమలు చేస్తామని చెప్పి మూడు సంవత్సరాలు అవుతున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను మరో మారు మభ్య పెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందిరమ్మ పేరుతో సంక్షేమ పథకాలను తెచ్చి ఊదరగొడుతున్న ప్రభుత్వం పథకం అమలులో విఫలమవుతూ ఇందిరమ్మ ఆత్మను గోసపెడుతున్నారు. సొంత కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్పా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలుచేయడంలో చిత్తశుద్ధి కనపడటం లేదు.సంక్షేమ పథకాలను అమలుచేయడం చేతకావడం లేదని సాక్షాతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు.ఇందిరమ్మ పేరుతో సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును చూసి ఇందిరమ్మ" ఆత్మ కూడా క్షోభిస్తుంది సంక్షేమ పథకాల అమలుపై బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటది. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: