మైనింగ్ పేరుతో దళితుల భూములను కొల్లగొడుతున్న వైనాన్ని జిల్లా కలెక్టర్కు శనివారం రోజున వినతిపత్రం అందజేశారు. రామాయంపేట మండలంలోని సర్వేనెంబర్ 1421 లో దళితులు గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తూ పంట పండిస్తున్న ప్రభుత్వం ద్వారా పట్టాలు సర్టిఫికెట్లు వన్ బీ లు ఉన్న ఈ భూములలో పేస్ వన్ టు పేరుతో టెండర్లు వేయించి మైనింగ్ కు అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే మైనింగ్ జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు కూడా నడుస్తున్నాయి స్కూలుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న దళితుల భూములలో మైనింగ్ అనుమతులు ఇవ్వడం వల్ల దళిత కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి ఇట్టి మైనింగ్ పనులను నిలుపుదల చేయాలని మైనింగ్ శాఖ మంత్రివర్యులకు మరియు జిల్లా పాలన అధికారి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, మాలల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల మైసయ్య, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, తూప్రానీ్ నర్సింలు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
మైనింగ్ టెండర్లతో దళితుల భూములకు రక్షణ కరువు
తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి అక్టోబర్
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి



